📍 Locations
F T W

సర్పంచ్ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్ విడుదల

Category: Local News | 29 Sep 2025

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గెజిట్ విడుదల చేశారు. అటు గ్రామపంచాయతీ వార్డుల రిజర్వేషన్లను కూడా ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మొత్తం 20 మండలాల్లోని 461 గ్రామ పంచాయితీలకు వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది.