📍 Locations
F T W

ఏదులాపురం మున్సిపల్ ఎన్నికలకు సర్వసన్నద్ధం*

Category: Breaking News | 27 Jan 2026

 

*ఏదులాపురం మున్సిపల్ ఎన్నికలకు సర్వసన్నద్ధం*

 

 ఖమ్మం రూరల్ మన వెలుగు ప్రతినిధి:- 

 

32 వార్డులకు ఏర్పాట్లు పూర్తి – కమిషనర్ మున్వర్ అలీ**

ఖమ్మం రూరల్ | మన వెలుగు ప్రతినిధి :-

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం సాయంత్రం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏదులాపురం మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ తెలిపారు.

మొత్తం 32 వార్డులు ఉన్న ఏదులాపురం మున్సిపాలిటీలో 45,256 మంది ఓటర్లు తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నామినేషన్ల స్వీకరణ కోసం మొత్తం 13 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఇందుకోసం 13 మంది రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), 13 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు) నియమించామని పేర్కొన్నారు.

వార్డుల వారీగా నామినేషన్ కేంద్రాల ఏర్పాటు ఇలా ఉంది.

1, 2 వార్డులకు స్ప్రింగ్లీఫ్ స్కూల్, కరుణగిరి.

3, 4, 5 వార్డులకు రూరల్ ఎంపీడీవో కార్యాలయం, జలగంనగర్.

6, 7, 22 వార్డులకు రూరల్ ఎంపీడీవో కార్యాలయంలోని ఎంపీవో కార్యాలయం.

8, 9, 13 వార్డులకు పాత పంచాయతీ కార్యాలయం, వెంకటగిరి.

10, 11, 12 వార్డులకు పాత పంచాయతీ కార్యాలయం, గుదిమళ్ల.

14, 15 వార్డులకు పాత తెల్దారుపల్లి పంచాయతీ కార్యాలయం.

16, 17 వార్డులకు పాత మద్దులపల్లి పంచాయతీ కార్యాలయం.

18, 19 వార్డులకు పాత పంచాయతీ కార్యాలయం, బారుగూడెం.

20, 21 వార్డులకు పాత పంచాయతీ కార్యాలయం, ముత్తగూడెం.

23, 24, 28 వార్డులకు రూరల్ ఎంపీడీవో భవనంలోని శ్రీశక్తి మీటింగ్ హాల్, జలగంనగర్.

25, 26, 27 వార్డులకు రూరల్ ఎంపీడీవో కార్యాలయంలోని ఎంఈవో కార్యాలయం, జలగంనగర్.

29, 30 వార్డులకు ఎంపీడీవో కార్యాలయంలోని ఐకేపీ కార్యాలయం, జలగంనగర్.

31, 32 వార్డులకు ఎంపీడీవో కార్యాలయంలోని ఈజీఏఎస్ కార్యాలయం, జలగంనగర్‌లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.

అదే విధంగా ఎన్నికల ముందు రోజుల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు, పోలింగ్ బాక్స్‌ల భద్రపరచేందుకు స్ట్రాంగ్ రూమ్, అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలను పెద్దతండాలోని ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కమిషనర్ మున్వర్ అలీ వెల్లడించారు.