📍 Locations
F T W

ఏదులాపురం మున్సిపల్ ఎన్నికలు: తొలి రోజున రెండు నామినేషన్లు దాఖలు

Category: Political News | 28 Jan 2026

ఏదులాపురం మున్సిపల్ ఎన్నికలు: తొలి రోజున రెండు నామినేషన్లు దాఖలు

 

ఖమ్మం రూరల్ మన వెలుగు ప్రతినిధి:

 

ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలి రోజున అధికారులు రెండు నామినేషన్ పత్రాలను స్వీకరించారు.

23వ వార్డు నుంచి తొకబత్తిని అనిత తన నామినేషన్ దాఖలు చేయగా, మరో వార్డుకు సంబంధించిన అభ్యర్థి కూడా నామినేషన్ పత్రాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. తొకబత్తిని అనిత స్థానిక కాంగ్రెస్ నాయకులు తోట చిన వెంకటరెడ్డి, వార్డు ఇంచార్జీ వంటికొమ్మలు శ్రీనివాసరెడ్డి‌లతో కలిసి రిటర్నింగ్ అధికారిని కలిసి నామినేషన్ వేశారు.

మొత్తం 32 వార్డులకు గాను 13 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి రోజున నామినేషన్ల ప్రక్రియ నెమ్మదిగానే సాగిందని అధికారులు తెలిపారు. నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండు రోజులు గడువు ఉండటంతో, రాబోయే రోజుల్లో నామినేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.