📍 Locations
F T W

మంత్రి దర్శనం అనంతరం పోలీసుల నిర్లక్ష్యం.. భక్తుల ఇబ్బందులు!

Category: Breaking News | 15 Feb 2026

*మంత్రి దర్శనం అనంతరం పోలీసుల నిర్లక్ష్యం.. భక్తుల ఇబ్బందులు!*

 

ఖమ్మం రూరల్ మన వెలుగు ప్రతినిధి:-

 

ఖమ్మం: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శనం పూర్తైన వెంటనే క్షేత్రస్థాయిలో పోలీసు యంత్రాంగం అప్రమత్తత కోల్పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దర్శనానికి ముందు వరకూ భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించిన పోలీసులు, మంత్రి వెళ్లిన తర్వాత మాత్రం టెంట్ల కిందకు పరిమితమైపోయారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్నా, క్యూలైన్లను సక్రమంగా నిర్వహించకపోవడంతో తోపులాటలు, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజల భద్రతను నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు తగిన శ్రద్ధ చూపడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దర్శనం సమయంలోనే కాకుండా, కార్యక్రమం పూర్తయ్యాక కూడా పోలీసు బలగాలు మైదానంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని భక్తులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత కఠినతరం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మరోసారి స్పష్టంగా చూపుతోందని స్థానికులు అంటున్నారు.