📍 Locations
F T W

ఉద్యోగం రావడంలేదని బెంగతో యువతి ఆత్మహత్య

Category: Breaking News | 18 Mar 2026

ఉద్యోగం రావడంలేదని బెంగతో యువతి ఆత్మహత్య...

 ఖమ్మం రూరల్ మన వెలుగు ప్రతినిధి:-

ఉద్యోగం రావడం లేదని తీవ్ర మనస్థాపనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెల్లారుపల్లి గ్రామానికి చెందిన ఉన్నం భవాని (25) పీజీ వరకు చదువుకొని గత కొంతకాలంగా ఇంటి దగ్గరే ఉంటూ కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది.ఎటువంటి నోటిఫికేషన్ రాకపోవడం,ఉద్యోగం ఇక రాదేమోనని బెంగతో తీవ్ర మనస్తాపం చెంది మంగళవారం ఉదయం గడ్డి మందు సేవించింది.గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించింది.వైద్యులు ఫలితం లేదని ఇంటికి తీసుకెళ్లమని సూచించారు.అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. మృతురాలి తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.