📍 Locations
F T W

పదో తరగతి స్నేహబంధం సజీవం… కష్టంలో కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు

Category: Local News | 16 Feb 2026

కూసుమంచి మన వెలుగు ప్రతినిధి:-

 

తోటి స్నేహితుడు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో పదో తరగతి చదివిన స్నేహితులు ఒక్కటయ్యారు. తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006–2007 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన నక్కల మల్లికార్జున్ (సీతారాంపురం) గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న అప్పటి పదో తరగతి సహపాఠులు బీరోలు, పోచారం, బంధంపెల్లి, చౌటపల్లి, సీతారాంపురం, ఎలువారిగూడెం గ్రామాలకు చెందిన వారు కలిసి చందా సేకరించారు. సేకరించిన మొత్తం రూ.50,000 నగదును మృతుడి కుటుంబానికి అందజేసి తమ స్నేహబంధానికి అర్థం చెప్పారు.

కష్ట సమయంలో స్నేహాన్ని మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో చూపిన ఈ మిత్రుల ఔదార్యాన్ని స్థానికులు, గ్రామ పెద్దలు అభినందించారు. ఇలాంటి సంఘటనలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పలువురు పేర్కొన్నారు.