📍 Locations
F T W

ఏదులాపురం మున్సిపాలిటీకి కొత్త కమిషనర్

Category: Breaking News | 30 Apr 2026

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో కమిషనర్ బదిలీ జరిగింది. గురువారం ప్రభుత్వం ప్రకటించిన బదిలీల్లో భాగంగా ప్రస్తుత కమిషనర్ మున్వర్ అలీని బదిలీ చేయగా, ఆయన స్థానంలో ఆళ్ల శ్రీనివాస్ రెడ్డిని నియమించారు.

మున్సిపల్ ఎన్నికల ముందు ఏదులాపురంలో కమిషనర్గా పనిచేసిన ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, అనంతరం నల్లగొండ జిల్లా ఆలియా మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో మళ్లీ ఆయనను ఏదులాపురం మున్సిపల్ కమిషనర్గా నియమించారు.

కొత్త కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని స్థానికులు భావిస్తున్నారు.

Related News