📍 Locations
F T W

రాయపర్తి: పంచాయతీ కార్యదర్శి నుంచి ఎక్సైజ్ ఎస్సైగా!

Category: Local News | 29 Sep 2025

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని జయరామ్ తండా(S) గ్రామ పంచాయతీ పరిధిలోని సుక్య తండాకు చెందిన సంతోశ్ కుమార్ గ్రూప్-2 పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. పర్వతగిరి మండలం పెద్దతండా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సంతోశ్ గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ఎక్సైజ్ శాఖ ఎస్సైగా ఎంపికయ్యారు. దీంతో తండావాసులు అభినందలు తెలుపుతున్నారు.