📍 Locations
F T W

జర్నలిస్టులపై అనుచిత వాక్యాలు సరికాదు

Category: Local News | 05 Nov 2025

జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు 

 సిపిఐ, ఏఐఎఫ్ ఆధ్వర్యంలో నిరసన 

  జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని, సమాజంలో అవినీతి వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా రాసే హక్కు జర్నలిస్టులకు ఉందని ఆ హక్కును కాలరాసే హక్కు ఏ ఏ శక్తులకు లేదని సీపీఐ 30వ డివిజన్ సెక్రెటరీ బియ్యాల రాజు అన్నారు. విలేకరులు వార్తలొస్తే వారి చేతులు కాళ్లు నరికేస్తామని కొంతమంది కుసంస్కారహీనులు మాట్లాడిన తీరును పలువురు మేధావులు, రాజకీయ పార్టీలు నాయకులు తో పాటు అధికారులు సైతం ఖండిస్తున్నారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ నందు సిపిఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులపై వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ... ‘మీడియా స్వేచ్ఛను హరించడాన్ని , ప్రతి ఒక్కరు ఖండించాలని ఆయన అన్నారు. సమాజంలో జర్నలిస్టులకు నాలుగవ స్థానం ఉందని అటువంటి స్థానం ఉన్న విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కొత్త తరహా విధానానికి దారితీస్తుందని ఆయన విమర్శించారు. ‘దాడులకు పాల్పడేలా వ్యవహరించిన వారిపై కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వాలు విలేకరుల హక్కులకు రక్షణ కల్పించాలనీ ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన లో ఏఐవైఎఫ్ యువజన సంఘం 28,29,30వ డివిజన్ నాయకులు మిరియాల నరుణ్ తేజ్, అక్కినపల్లి దేవయ్య, పానమాకుల కృపాకర్, యువజన సంఘం సభ్యులు హనే, టేకుమట్ల ప్రభాకర్, బాబి, నాగేంద్రబాబు, సంపత్, సిపిఐ సోషల్ మీడియా ఇంచార్జ్ రెబ్బగొండ్ల గోపి తదితరులు ఉన్నారు.