📍 Locations
F T W

ఉరిని గెలిపించేలా నిర్ణయం తీసుకోండి

Category: Local News | 29 Nov 2025

ఖమ్మం రూరల్ : ఊరిని గెలిపించేలా నిర్ణయాలు తీసుకోండి

ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి

మన వెలుగు ప్రతినిధి

ఖమ్మం రూరల్, నవంబర్ 29 :

ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే గ్రామం అభివృద్ధి చెందుతుందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఊరు గెలిచేలా నిర్ణయాలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి సూచించారు. శనివారం మండలంలోని వివిధ রাজনৈতিক పార్టీల నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ పుష్కరాజ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

ఎన్నికల ప్రక్రియలో ఎవరూ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించరాదని స్పష్టం చేశారు. నామినేషన్ దశ నుంచి ఫలితాల అనంతరం వరకు గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు. కులమతాల పేరుతో ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి సెక్టార్‌కు ఒక ఎస్సై

గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల పరిధిలో 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఏసీపీ తెలిపారు. పోలింగ్ కేంద్రం చుట్టూ 200 మీటర్ల లోపు ఇళ్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగించేలా ఎన్నికల సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. ప్రచారంలో ర్యాలీలు నిర్వహించాలంటే ఒక రోజు ముందుగానే అనుమతి తీసుకోవాలని సూచించారు. మండలంలో మొత్తం ఎనిమిది సెక్టార్లు ఏర్పాటు చేయగా, ప్రతి సెక్టార్‌కు ఒక సబ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఉంటుందని వెల్లడించారు. సాధ్యమైనంత వరకు గ్రామస్తులు ఏకగ్రీవంగా తమ అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు.

ఎన్నికల ప్రశాంతత అందరి బాధ్యత

ఎన్నికల సందర్భంగా ఎటువంటి సందేహాలున్నా తక్షణమే రూరల్ సీఐ లేదా ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని కోరారు. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు చేయవద్దని హెచ్చరిక జారీ చేశారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. కేసులు నమోదైతే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదురవుతాయని స్పష్టం చేశారు. ఎన్నికల కాలంలో పోలీసుల పర్యవేక్షణ 24 గంటలూ కొనసాగుతుందని చెప్పారు.

సమావేశంలో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ పుష్కరాజ్, పలువురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, గ్రామాల రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.