📍 Locations
F T W

ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్‌గా మున్వర్ అలీ బాధ్యతలు స్వీకరణ

Category: Breaking News | 24 Jan 2026

ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్‌గా మున్వర్ అలీ బాధ్యతలు స్వీకరణ

ఖమ్మం రూరల్ | మన వెలుగు :

ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్‌గా ఎండీ మున్వర్ అలీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి ఇటీవల పలు మున్సిపాలిటీల కమిషనర్లను బదిలీ చేసిన విషయం తెలిసిందే.

ఈ బదిలీల్లో భాగంగా ఇంతకాలం ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆళ్ల శ్రీనివాస్ రెడ్డిని నల్లగొండ జిల్లా హాలియాకు బదిలీ చేయగా, ఆయన స్థానంలో తిరుమలగిరి మున్సిపాలిటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న మున్వర్ అలీని ఎదులాపురం మున్సిపాలిటీకి బదిలీ చేశారు.

శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ మున్వర్ అలీకి మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఎదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి ఆయన నాయకత్వం మరింత దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు