📍 Locations
F T W

ఆకాష్ ఆలోచనకు ఫిల్మ్ ఫెస్టివల్ ఫిదా

Category: Breaking News | 19 Jan 2026

ఆకాష్ ఆలోచనకు ఫిల్మ్ ఫెస్టివల్ ఫిదా

ప్రపంచ ఫిల్మ్ ఫెస్టివల్ కు లూనా ఎంపిక

ఫిబ్రవరి నెలలలో ఢిల్లీ లో ప్రదర్శన

సంతోషం లో ఆకాష్ కుటుంబం

ఖమ్మం మన వెలుగు ప్రతినిధి:

 చిన్న వయస్సు నుంచే తన ఆలోచనలకు ఆవిష్కరణలు చేస్తూ చివరికి ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఖమ్మం యువకుడి ప్రతిభ పట్ల సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి ఒకవైపు విద్యభ్యాసం కొనసాగిస్తున్నాయి మరోవైపు తన ఆవిష్కరణలకు పదులు పెట్టి ఏకంగా ప్రపంచ స్థాయిలో నేను సైతం అంటూ వెలుగులోకి వచ్చిన ఖమ్మం కుర్రాడి ప్రతిభకు ప్రశంసలు లభిస్తున్నాయి పూర్తి వివరాల్లోకి వెళితే ఖమ్మం నగరానికి చెందిన గోగినేని ఆకాష్ ప్రాథమిక విద్య ఉన్నత విద్య ఇంటర్ తో పాటు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇటీవల పీజీ విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లడం జరిగింది అయితే చిన్నతనం నుంచే ఆవిష్కరణలకు అలవాటు పడిన ఆకాష్ తనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం దూరదృష్టి ఫలితంగా ఓ గొప్ప ఆవిష్కరణ చేశాడు తన చేతి రాతతో ఆర్టును గీసి సాంకేతికంగా ఆ బొమ్మకు ప్రాణం పోసి నాలుగు నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించి భావితరాలకు సందేశాత్మక చిత్రం రూపొందించాడు మానవుడు భూమిపైనే కాకుండా ఆకాశంలో సైతం అద్భుతాలు చేస్తే ఫలితంగా భావితరాలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఈ చిత్రం ద్వారా చాటి చెప్పాడు లూనా అనే పేరుతో రోబో ఎక్స్ ప్లాజర్ తయారుచేసి దానికి *లూనా* నామకరణం చేసి రూపొందించిన వీడియోను అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు పంపించడం జరిగింది

*60 దేశాలు వెయ్యి కి పైన చిత్రాలు*

 ప్రపంచ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు జరగనుంది ఇందుకు సంబంధించి ఇప్పటికే నిర్వాహకులు ప్రపంచవ్యాప్తంగా సందేశాత్మకమైన షార్ట్ ఫిలిం లను పోటీలకు ఆహ్వానించారు అందుకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల  నుంచి  సుమారు వేయి కి పైన చిత్రాలు ఫిలిం ఫెస్టివల్ కు పోటీ పడటం జరిగింది వివిధ దేశాల నుంచి వచ్చిన షార్ట్ ఫిలిం నుండి పరిశీలించిన నిర్వాహకులు వాటిలో నుంచి కొన్నింటిని మాత్రమే ప్రదర్శకు అనుమతి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఢిల్లీలో జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్  ఫెస్టివల్(జేఐఎఫ్ఎఫ్) న్యూఢిల్లీ ఫిలిం ఫెస్టివల్ (ఎన్డీఎఫ్ ఎఫ్) రెండు రకాల ఫిలిం ఫెస్టివల్ జరగనున్నాయి ఈ రెండు పోటీలకు ఆకాష్ రూపొందించిన లూనా షార్ట్ ఫిలిం ఎంపిక కావడం విశేషం.

*లూనా కథా నేపథ్యం*

 లూనా అనగానే సాధారణంగా అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగించడం జరుగుతుంది భూమి నుంచి రాకెట్ లో స్పేస్ కి వెళ్ళిన వ్యోమగాములు లోన సహాయంతో తమ పరిశోధనలు చేస్తుంటారు అయితే ఆకాష్ రూపొందించిన లోన భవిష్యత్తు కాలంలో అంతరిక్ష ప్రయాణంలో సుమారు 1000 ఒక వంద సంవత్సరాల తర్వాత అంతరిక్షంలో ఏం జరగనుంది అప్పటికే అంతరించిపోయిన జీవాన్ని మళ్లీ సృష్టించేందుకు లోన చేసే ప్రయత్నం ఈ నాలుగు నిమిషాల నిడివి గల వీడియోలు చూపించడం జరిగింది అంతరిక్షంలోకి వెళ్లిన లోన ప్రయోగం చేస్తున్న సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను సైతం ఈ ఫిల్ములో ఆకాష్ కళ్లగట్టినట్టుగా చూపెట్టడం విశేషం ఓరియన్ అనే గ్రహంలో అగ్నిపర్వత గుహలు ఆకాశ తిమింగలాల అవశేషాలు రహస్యమైన ఎనర్జీ ప్రాంతాలను ప్రమాదకరమైన భూభాగాలు ఇలా ఏడు రకాల విచిత్రమైన సవాళ్లను ఎదుర్కొంటూ లోన సాధించిన అద్భుత ప్రగతి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది 

*ఆకాష్ ప్రతిభకు సర్వత్రా హర్షాతిరేకాలు*

 చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తి కలిగిన ఆకాష్ అమెరికాలో  MS  పూర్తి చేస్తూనే *LUNA* షార్ట్ ఫిల్మ్  ని తయారు చేస్తుండం గానే *AI Engineer* UST (GSU) లో ఉద్యోగంసాధించారు. ఆసక్తిని తనకు ఉన్నటువంటి క్రియేటివ్ టాలెంట్ ద్వారా వ్యక్తపరచడంతో అద్భుతమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినట్లయితే జిల్లాకు చెందిన యువ దర్శకుడి సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపిక కావడం పట్ల జిల్లా వ్యాప్తంగా పలువురు మేధావులు ఆకాష్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో ఆకాష్ మరిన్ని అంతర్జాతీయ ప్రాజెక్టులు చేసి సమాజ నిర్మాణ ప్రక్రియకు భావితరాలకు ఉపయోగకరంగా ఉండే ఆవిష్కరణలు రూపొందించాలని కోరుతున్నారు.