📍 Locations
F T W

ఆర్ఎంపీలకు గుర్తింపు వచ్చేదాకా పోరాటమే: పిట్టల నాగేశ్వరరావు

Category: Breaking News | 05 Aug 2025

గ్రామీణ వైద్యులను నకిలీ వైద్యులుగా ముద్రవేయడం సరికాదని, వారికి చట్టబద్ధ గుర్తింపు ఇవ్వాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ హయాంలో ఇచ్చిన శిక్షణ విధానాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలన్నారు. మారుమూల గ్రామాల్లో సేవలందిస్తున్న ఆర్ఎంపీలపై దాడులు, క్లినిక్‌లను సీజ్ చేయడం అన్యాయం అన్నారు. ప్రతి ఆర్ఎంపీ డాక్టర్ల వద్ద అనుభవం సంపాదించాకే సేవలందిస్తున్నారని తెలిపారు. గ్రామీణ వైద్యుల్ని ప్రభుత్వ వైద్య వ్యవస్థలో భాగస్వాములుగా చేయాలన్నారు. గుర్తింపు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు.