📍 Locations
F T W

తెలంగాణలోని పంచాయతీ కార్యదర్శులకు గుడ్‌న్యూస్... రూ.104 కోట్లు విడుదల

Category: Political News | 29 Sep 2025

పంచాయతీ కార్యదర్శుల నిరీక్షణ ఫలించింది. గత కొన్నిరోజులుగా పెండింగ్ బిల్లుల విడుదల కోసం పంచాయతీరాజ్ కార్యదర్శులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులు బిల్లులకు సంబంధించి రూ.104 కోట్లు విడుదల చేసింది. దీంతో పంచాయతీ కార్యదర్శలు బిల్లులకు మోక్షం కలిగినట్లు అయ్యింది. ఈ నిర్ణయం పట్ల పంచాయతీ కార్యదర్శులపై ఉన్న ఒత్తిడి తగ్గినట్లు అయ్యింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.