📍 Locations
F T W

గ్రూప్-2లో ఎస్‌ఐలుగా చింతకాని యువకులు

Category: Local News | 29 Sep 2025

చింతకాని మండలంలోని నరసింహపురం గ్రామానికి చెందిన జక్కుల వేణు, చింతకాని గ్రామానికి చెందిన పొనుగోటి ఉపేందర్ గ్రూప్-2లో ప్రతిభా చాటి ఎక్సైజ్ శాఖలో ఎస్సైలుగా ఎంపికయ్యారు. మధ్యతరగతి రైతు కుటుంబాల నుంచి వచ్చి, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే కష్టపడి ఈ విజయాన్ని సాధించారు. వారి విజయం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేసి, అభినందనలు తెలిపారు.